ఘనంగా ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ ప్రారంభం

  • 450 స్టాల్స్ ఏర్పాటు
  • అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళను ప్రారంభిస్తున్న శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్ రావు  ఐఏఎస్, అరుణ్ కుమార్  డైరెక్టర్ హ్యాండ్లూమ్,  నర్సింహులు జ్యూట్ బోర్డు డిపార్ట్ మెంట్, చేనేత హస్త  కళాకారులు, అవార్డు విన్నర్లు

నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో  ఈసారి కూడా  “ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ” ను ఘనంగా ప్రారంభించారు. శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్ రావు  ఐఏఎస్, అరుణ్ కుమార్  డైరెక్టర్ హ్యాండ్లూమ్,  నర్సింహులు జ్యూట్ బోర్డు డిపార్ట్ మెంట్, చేనేత హస్త  కళాకారులు, అవార్డు విన్నర్లు, అంజయ్య జనరల్ మేనేజర్ శిల్పారామం సిబ్బంది డోలు కొట్టి మేళను ప్రారంభించారు.  మినిస్ట్రీ ఆఫ్ టెక్స్ టైల్స్, హ్యాండ్లూమ్స్ డిపార్ట్ మెంట్ నుడి దాదాపుగా వంద స్టాళ్ల,  నేషనల్ జ్యూట్ బోర్డు నుంచి నలభై , స్టేట్ అవార్డు  ఆరుగురు,  నేషనల్ అవార్డ్స్ ఇరవై ఒక్కటి, సంత్ కబీర్ అవార్డు వారి నుంచి ఆరుగురు  అన్ని కలుపుకొని నాలుగు వందల యాభై స్టాల్ ఈ ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ లో సందర్శకులకు ఏర్పాటు చేశారు.  వివిధ రాష్ట్రాలకి చెందిన చేనేత , హస్తకళా, జ్యూట్, టెర్రకోట, వుడ్ కార్వింగ్, కి సంబంధించిన స్టాల్ల్స్ ఉదయం 10 .30  నుండి సాయంత్రం 8 .00  గంటల వరకు కొలువుదీరి ఉంటాయి. యంపీ థియేటర్  లో సాంస్కృతిక కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు గుజరాత్ కమీషనర్ యూత్ సర్వీస్ & కల్చరల్ అసిటిఇటిఎస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సభ్యులు మిశ్ర రాస్, హుడా, టిప్పణి నృత్యాలు శ్రీ హరీష్ మాధవి పోర్బందర్,  ప్రాచీన గార్బో, అర్వాచీన గార్బో నృత్యాలను హర్షసింహ్ అహ్మదాబాద్ ప్రదర్శించి మెప్పించారు. డాక్టర్ ప్రియాంక మిశ్ర బృందం ఒడిస్సి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.

ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా ప్రారంభోత్సవంలో కళాకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here