నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన వికర్ సెక్షన్ కాలనీ, విశ్వేశ్వరయ్య కాలని పలు కాలనీలలో వరద ముంపు ప్రాంతాల్లో అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పర్యటించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి విశ్వేశ్వరయ్య కాలనీలో ఓ అపార్ట్ మెంట్ సెల్లర్ లోకి వరద నీరు చేరింది. ఈ సందర్బంగా వారితో మాట్లాడి భరోసా కల్పించారు. సెల్లార్ లోని వరదను మోటర్ల సహాయంతో వెంటనే తోడేయాలని అధికారులకు ఆదేశించారు. వర్షాల వల్ల ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా చూడాలని, రహదారులపై ఉన్న వరద నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రానున్న మరో రెండు రోజులు నగరంలో వర్షాలు ఉన్నాయని అవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దన్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కాలనీలలో చెత్త పేరుకు పోకుండా జిహెచ్ ఎంసి సిబ్బంది తొలగిస్తున్నారని, కాలనీలో ఇంటి చుట్టూ పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.