నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ క్యాంపు కార్యాలయంలో కార్గిల్ యుద్ధంలో అమరులైన యుద్ధ వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్బంగా బండి రమేష్ మాట్లాడుతూ గుర్తుంచుకోవాల్సిన నిజమైన రోజుల్లో ఇదొకటి అని.. రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకునే రోజుల్లో ఇదొక ప్రధానమైన రోజని, మన కోసం, నిన్నటి వారి జీవితాన్ని త్యాగం చేసిన వీరులు మన సైనికులు అని తెలిపారు.
దేశ రక్షణ కోసం ప్రాణాలర్పిస్తున్న అమర వీర జవానులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగారం సంగారెడ్డి, నర్సింగ్ రావు, ఎక్స్ ఆర్మీ సాయన్న, శేఖర్ గౌడ్, తెప్ప బాలరాజు ముదిరాజ్, సలీం బాయ్ , సత్య రెడ్డి, రవీందర్ రావు, వైవి రమణ, దేవేందర్రావు, ఉమేష్, అంజా అమ్ము, షరీఫ్, అబ్దుల్ మునాఫ్ ఖాన్, వెంకటేశ్వరరావు, సత్తయ్య పాల్గొన్నారు.