రాజకీయ రంగంలోనూ రాణించాలి

  • శేరిలింగంపల్లి నియోజకవర్గం వడ్డెర కుల ఆత్మీయ సమ్మేళనంలో  జాతీయ వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేముల వెంకటేష్, వడ్డెర రాష్ట్ర విద్యావంతుల వేదిక అధ్యక్షులు సమ్మయ్య

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు 70 వేల మందికి పైగా ఓటర్లు ఉన్న సామాజికవర్గం వడ్డరులను, రాజకీయంగా సామాజికంగా గుర్తించి, చట్టసభలలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పలు పార్టీలలో ప్రాతినిధ్యం కల్పించి అవకాశాలు ఇవ్వాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ వడ్డెర కుల సంగం తీర్మానించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జాతీయ వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేముల వెంకటేష్, వడ్డెర రాష్ట్ర విద్యావంతుల వేదిక అధ్యక్షులు సమ్మయ్య, డాక్టర్ కొరదాల నరేష్ పాల్గొని ప్రసంగించారు. వడ్డెర కులస్తులు కొండల్ని సైతం పిండి చేయడమే కాదు, విద్య విజ్ఞానమును సంపాదించి, ఉన్నత పదవులు అలంకరించాలని సమ్మేళనంకు విచ్చేసిన వడ్డెర కులస్తులకు పిలుపునిచ్చారు.

రాజకీయ రంగంలోనూ వార్డ్ మెంబర్స్ స్థాయి నుండి ఎమ్మెల్యే ఎంపీ వరకు ఎదగాలని సూచించారు. గత ప్రభుత్వాలు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు వడ్డెర కులాలకు సముచిత స్థానం కల్పించారని,  టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ సారి బిఆర్ఎస్ పార్టీకి  తమ మద్దతు ఉండదని, మమ్ములను ఎవరు గుర్తిస్తే వాళ్లకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరికుప్పల లింగయ్య, శివరాత్రి యాదయ్య, వల్లపు యాదయ్య, సంపంగి మల్లేశు, ముద్దంగుల తిరుపతి, మసాని ఎట్టయా,  జేరిపాటి తిమ్మయ్య,  వల్లపు హనుమంతు, రూపాని చంద్రయ్య, కుంట్ల గంగరం, మాధవరావు, శంకరయ్య, హనుమంతు, సాయ్కుమార్, బాబుమోహన్ మల్లేష్, తిరుపతి, జె. మల్లేష్, వి. మన్యం, ఏ మారయ్య, ఎస్. తిమ్మయ్య, విశాఖ, విజయ్, నరసింహ, అంజి, పి కొండల్, ఒంటిపుల్లు నాగరాజు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here