భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అరెకపూడి గాంధీని అఖండ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇద్దామని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని బికే ఎన్ క్లేవ్, ప్రాజయ్ షల్టర్, సాయిజ్యోతి నగర్, డాక్టర్స్ రెడ్డీస్ కాలనీలలో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ గారి గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి చేపట్టిన ఇంటింటి ప్రచారంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు.

ఇంటింటా ప్రచారంలో ఉప్పలపాటి శ్రీకాంత్

అనంతరం మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ గారిని ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని య BK ఎనక్లేవ్, ప్రాజయ్ షల్టర్, సాయిజ్యోతి నగర్, డాక్టర్స్ రెడ్డీస్ కాలనీల ప్రజలకు శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. మియాపూర్ డివిజన్ పరిదిలోని బికె ఎన్ క్లేవ్, ప్రాజయ్ షల్టర్, సాయిజ్యోతి నగర్, డాక్టర్స్ రెడ్డీస్ కాలనీలలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగిందని, ప్రజలనుంచి మంచి స్పందన ఉందని, మళ్లీ గాంధీకే తమ మద్దతు అంటూ ప్రజలు చెబుతున్నారన్నారు.

పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్న ఉప్పలపాటి శ్రీకాంత్

గత తొమ్మిదిన్నరేళ్లుగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నిరంతరం సేవచేసిన నాయకుడు, మన కష్టసుఖాల్లో పాలుపంచుకుని అనునిత్యం మనకు అండగా నిలిచిన నేత గాంధీని మళ్లీ ఆశీర్వదించాలని కార్పొరేటర్ శ్రీకాంత్ కోరారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీలకు చెందినవారు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని, పార్టీలో చేరిన వారంతా పార్టీకోసం కష్టపడి పనిచేయాలని, తాను అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here