కారు గుర్తుకే ఓటేద్దాం – గులాబీ జెండా ఎగురవేద్దాం

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆర్ బిఆర్ టవర్స్, ఎస్ఆర్ ఎస్టేట్స్, వీడియో కాలనీ , ఎఫ్ సి ఐ కాలనీ, అమన్ కాలనీ, చిరంజీవి కాలనీలలో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ గెలుపు కొరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో నిర్వహించారు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్.

అరికెపూడి గాంధీకి ఓటేయాలని కోరుతూ కార్పొరేటర్ ఉప్పలపాటి ప్రచారం

ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ, శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీని ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, పార్టీలో చేరిన వారంతా పార్టీకోసం కష్టపడి పనిచేయాలని, అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు.

ప్రచారంలో భాగంగా పార్టీ శ్రేణులతో ఉప్పలపాటి శ్రీ కాంత్

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయో భిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here