తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : మహారాష్ట్ర తుల్జాపూర్‌లోని తుల్జా భవానీ అమ్మవారిని గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ దర్శించుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులతో తరలివెళ్ళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా వారికి వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులతో చ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. వారి వెంట గచ్చిబౌలి డివిజన్ పరిధి లోనీ రాష్ట్ర, జిల్లా, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సీనియర్ నాయకులు డివిజన్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here