శేరిలింగంపల్లి, అక్టోబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): 33 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటు, 11 కేవీ ఇంటర్లింకింగ్ పనుల కారణంగా గురువారం (అక్టోబర్ 29) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. విద్యుత్ పనుల నేపథ్యంలో వేర్వేరు సమయాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు తారానగర్ ఆపరేషన్స్ ఏఈ వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హుడా కాలనీ, చర్చి రోడ్, జయశంకర్ పార్క్ రోడ్, శాంతినగర్ టింబర్ డిపో, గంగారాం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు చందానగర్ రైల్వే స్టేషన్ రోడ్, సాయిబాబా ఆలయం, హుడా కాలనీ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయే సమయాలను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.





