నమస్తే శేరిలింగంపల్లి : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని వాంబే కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శాలువాతో సన్మానించి, అభినదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ వాంబే కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాంబే కాలనీ ప్రెసిడెంట్ కమ్మరి మురళి, జాయింట్ సెక్రటరీ శ్యామల రావు, ఉపాధ్యక్షులు ఎత్తిరి శ్రీను, మౌనిక, సాయి, రాకేష్, వేణు గోపాల్, యాదగిరి, కరుణాకర్, శ్రీ శైలం కాలనీవాసులు పాల్గొన్నారు.