నవంబర్ 2న బీజేపీ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి: ఆలె భాస్కర్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నవంబర్ 2వ తేదీన ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించనున్న బీజేపీ మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా ఇన్‌చార్జి ఆలె భాస్కర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హఫీజ్‌పేట్‌లోని ప్రజయ్ సిటీలో డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ కార్యవర్గ సమావేశంలో ఆయన, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలె భాస్కర్, మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. హఫీజ్‌పేట్ డివిజన్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం సాధించడమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

బీజేపీ రాష్ట్ర నాయకత్వం సూచనల మేరకు డివిజన్, బూత్ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని నేతలు సూచించారు. నవంబర్ 2న ట్యాంక్‌బండ్ వద్ద జరగనున్న మహా పాదయాత్రకు పెద్దఎత్తున జనసమీకరణ చేయాలని, డివిజన్లలో ప్రభావం కలిగిన వ్యక్తులతో టిఫిన్ బైఠక్‌లు నిర్వహించాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి రవీందర్ రావు, డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతి, జిల్లా ఉపాధ్యక్షుడు మూల అనిల్ గౌడ్, హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సజ్జ కోటేశ్వరరావు, రవి గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఆళ్ల వరప్రసాద్, డివిజన్ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్, ఉపాధ్యక్షుడు శివాజీ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు అశోక్ నాయీ, సుబ్బారావు, రాజు గౌడ్, నరసింహ, కార్తీక్, మహిళా నాయకురాలు పావని, నాగేశ్వర్ రావుతో పాటు వివిధ మోర్చాల నాయకులు, బూత్ అధ్యక్షులు హాజరయ్యారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here