శేరిలింగంపల్లి, అక్టోబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మాదాపూర్ కావూరి హిల్స్‌లో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మమత ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్ఆర్ ఫార్చూన్ ప్రైమ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని పట్టభద్రులను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను ఓటర్లుగా నమోదు చేసుకునేలా దరఖాస్తు ఫామ్‌లను అందజేశారు. వారిచే ఓటర్లుగా నమోదు చేయించారు. ఎన్నికల్లో ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.






