టెలికాం నగర్ అభివృద్ధికి కృషి చేస్తాం : ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికాం నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ హామీ ఇచ్చారు. కాలనీలో అసంపూర్తిగా ఉన్న భూగర్భ డ్రైనేజీ (UGD) పనులను పూర్తి చేయడంతో పాటు, అవసరమైన చోట్ల రోడ్ల మరమ్మత్తులు చేపట్టి, పార్కులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. టెలికాం నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ సీనియర్ నాయకుడు గణేష్ ముదిరాజు ఆధ్వర్యంలో కాలనీ వాసులు బుధవారం వివేకానంద నగర్‌లోని ఆరెకపూడి గాంధీ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. టెలికాం నగర్ అభివృద్ధికి గతంలో విశేష కృషి చేసి, పలు మౌలిక వసతులు కల్పించినందుకు గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే, కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన UGD పనులను పూర్తి చేయాలని, దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని, పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని కోరారు. కాలనీ వాసుల విజ్ఞప్తిపై ఆరెకపూడి గాంధీ స్పందిస్తూ.. టెలికాం నగర్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని, అవసరమైన ప్రాంతాల్లో రోడ్లను పునరుద్ధరించి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, కాలనీలోని పార్కులను అభివృద్ధి చేసి, సుందరమైన పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టెలికాం నగర్ కాలనీ వాసులు సుస్మిత, రామారావు, దత్తు, నరేంద్ర, రాంబాబు, గంగ, కోటేశ్వరరావు, కృష్ణారావు, విజయలక్ష్మి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here