కలంతో సమాజాన్ని ప్రభావితం చేయగలిగే శక్తి పాత్రికేయులకే ఉంది

  • శేరిలింగంపల్లి నియోజకవర్గ పాత్రికేయుల అభివృద్ధికి బాధ్యత తీసుకుంటాం

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే-ఐజేయూ) ఆధ్వర్యంలో మియాపూర్ అశోక గ్రాండ్ హోటల్ వద్ద శేరిలింగంపల్లి నియోజకవర్గ నూతన అధ్యక్షులు/కార్యవర్గ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ కలిసి పాల్గొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ (టీయూడబ్ల్యూజే-ఐజేయూ) నూతన అధ్యక్షుడు కొండ విజయ్, కమిటీ సభ్యులను అభినందించారు.

(టీయూడబ్ల్యూజే-ఐజేయూ) ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ నూతన అధ్యక్షులు/కార్యవర్గ సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతున్న శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేయగలిగే శక్తి ఒక్క పాత్రికేయులకే ఉంటుందని, వారి కలంతో ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపుతూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచే రాజకీయ నాయకులకు, సమాజంలో ఉన్న అనేక మంది విద్య/వైద్య/సేవ రంగాల్లో ఉండే వారికి ప్రజల్లో సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక రంగం పాత్రికేయ సోదరులని పేర్కొన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ నూతన అధ్యక్షులు/కార్యవర్గ సభ్యులను అభినందిస్తూ..

శేరిలింగంపల్లి నియోజకవర్గ పాత్రికేయ కుటుంబాల అభివృద్ధికి తమవంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వారికి హామీ ఇచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here