శేరిలింగంపల్లి బీజేపీ ఎస్సీ యువ మోర్చా జనరల్ సెక్రటరీగా కొండేటి మరియ రాజు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శేరిలింగంపల్లి డివిజన్ ఎస్సీ యువ మోర్చా జనరల్ సెక్రటరీగా కొండేటి మరియ రాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, డివిజన్ కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేశారు. కొండేటి మరియ రాజు నియామకంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవి కుమార్ యాదవ్, శేరిలింగంపల్లి నియోజకవర్గ మాజీ కార్పొరేటర్ ఎల్లేష్, డివిజన్ అధ్యక్షుడు భీమని కిషోర్ ముదిరాజ్ తదితర నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కొండేటి మరియ రాజు మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. బీజేపీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. నాయకులు మాట్లాడుతూ, కొండేటి మరియ రాజు సేవా దృక్పథంతో పనిచేస్తూ యువతను పార్టీ వైపు ఆకర్షించాలని, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆయన నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని కోరుతూ పలువురు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here