నమస్తే శేరిలింగంపల్లి : మహారాష్ట్ర తుల్జపూర్ లో కొలువైన “శ్రీశ్రీశ్రీ తుల్జభవాని” అమ్మవారిని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు కార్పొరేటర్ ని ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలో తుల్జభవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి మొక్కును చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదములు అందజేశారు.