బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుంది : కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని..డబ్బులు ఉంటే ఎవరినైనా కొనుగోలు చేయవచ్చనే ఉద్దేశంతో బిజెపి నాయకులు పనిచేస్తున్నారని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి విమర్శించారు.
బిజెపి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలును నిరసిస్తూ.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ పిలుపు మేరకు.. టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి సమక్షంలో చందానగర్ డివిజన్ గాంధీ విగ్రహం వద్ద ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బిజెపి పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. టిఆర్ఎస్ పార్టీలో శిండేలు లేకపోవడంతో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నింస్తుందని, బిజెపి పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో అధికారంలోకి రాదన్నారు. అనంతరం చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని ప్రజలు బిజెపి పార్టీని నమ్మే స్థితిలో లేరని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలతో దాడులు నిర్వహిస్తుందని ఆరోపించారు. బిజెపి పార్టీ నాయకులు రాష్ట్రంలో ఎన్ని అడ్డదారులు తొక్కినా తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. గతి లేని పక్షంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు లక్ష్మి నారాయణ గౌడ్, జనార్ధన్ రెడ్డి, గోపీ కృష్ణ , సుప్రజా ప్రవీణ్, ఓ వెంకటేష్, పుల్లిపాటి నాగరాజు వరలక్ష్మి రెడ్డి, అక్బర్ ఖాన్, అహ్మద్ పాషా, ఎల్లమయ్య, దీక్షిత్ రెడ్డి, అమిత్ దూబే, రాజశేఖర్ రెడ్డి, కొండల్ రెడ్డి, అస్ఫర్, గిరి, ప్రవీణ్, జ్యోతి, వెంకటేష్, వసీం, కుమార్, అల్తాఫ్, షబం, మహబూబ్, రమేష్, మల్లేష్ పాల్గొన్నారు.

చందానగర్ డివిజన్ గాంధీ విగ్రహం వద్ద ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here