ఆదరణను ఓర్వలేక.. మోడీ, అమిత్ షా కుట్ర

  • అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు మోడీ..
  • ఒక్కో ఎమ్మెల్యే కు రూ. 100 కోట్లతో కొనాలని చూశారు
  • ప్రశాంతంగా ఉన్న సర్కారును పడగొట్టాలని కుట్ర చేశారు.
  • మునుగోడు ఓటమి భయంతోనే కొనుగోళ్ల స్కెచ్
  • బిజెపి నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో ఎక్కడా లేనివిధంగా 70లక్షల మందికి తెలంగాణ సర్కారు పింఛన్లు ఇస్తున్నదని, ఆసరా పింఛన్లతో వృద్ధులకు భరోసా లభించిందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. తెలంగాణ వచ్చాక కరువు అనేదే.. లేదని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు వదులుకోరని అన్నారు. గురువారం హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని అల్విన్ కాలనీ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బీజేపీ దిష్టిబొమ్మను టిఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలతో కలిసి దహనం చేశారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కొని ఉప ఎన్నిక తీసుకురాగా.. ఓడిపోతామనే భయంతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బిజెపి నాయకులు తెర తీశారని, అప్పుడు చంద్రబాబు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని రేవంత్ రెడ్డి ద్వారా కుట్రలు చేసి బట్టబయలై, ఓటుకు నోటు దొంగగా ఇక్కడి నుంచి పరారయ్యారని పేర్కొన్నారు. ఇప్పుడు బీజేపి నేతలు, మోదీ సైతం అచ్చం చంద్రబాబు లాగే దుర్మారంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారన్నారు. ఒక్కో ఎమ్మెల్యే కు రూ. 100 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయాలని చేసిన కుట్ర బట్టబయలు అవడంతో బిజెపి నీచ రాజకీయం తేటతెల్లమైందని తెలిపారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని బిజెపి కొనుగోలు చేసినట్లు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎవరు కొనలేరని మంత్రి పేర్కొన్నారు. ఆదాని, అంబానీలకు దేశాన్ని తాకట్టు పెట్టి వచ్చిన సొమ్ముతో ఇలా ఎమ్మెల్యేలను కొనే కుట్రలు చేస్తున్నారని, కేంద్రంలోని బిజెపి సర్కారు తీరు పట్ల తీవ్రంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బాలింగ్ యాదగిరి గౌడ్, హఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాగేశ్వరరావు, ఏకే బాలరాజు యాదవ్, సాంబశివరావు, సయ్యద్ గౌస్, రాజు ముదిరాజ్, రామకృష్ణ గౌడ్, సాంబయ్య, సాంగ రెడ్డి, మల్లికార్జున్, దామోదర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజధర్మ రెడ్డి, రఘునాథ్, వెంకట్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, యాదగిరి, నాగరాజ్, మహేష్, రెహ్మాన్, రామాంజనేయులు, రాందాస్, సయ్యద్ సత్తర్ హుస్సేన్, షేక్ సాబేర్, ముమఫ్ ఖాన్, ఖాసీం, బాబూమియా, బుజంగం, సలీం, హుస్సేన్, స్వామి, మల్లా రెడ్డి, సత్యం, సంజు, సత్యనారాయణ , కమోజీ, భగత్, గౌస్, రవి కుమార్, కంది జ్ఞనేశ్వర్, లాలూ పటేల్, రాజు, చిన్న, విగ్నేశ్వర్ రెడ్డి, నదీమ్, బాలరాజు, ముక్తర్, రామకృష్ణ, శ్రీనివాస్, మల్లేష్ గౌడ్, గోపి, దేవేందర్, హనీఫ్, ఉన్నూరు, లోకేష్, సీతారాం, మహీందర్, మహిళలు లక్ష్మీ, షేబన, గీత, పర్వీన్, షాహీన్ బేగం పాల్గొన్నారు.

అల్విన్ కాలనీ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బీజేపీ దిష్టిబొమ్మను టిఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలతో కలిసి దహనం చేస్తున్న మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here