- సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కి చెందిన రమేష్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే తిరిగి సొంత గూటికి (బీఆర్ఎస్ పార్టీలోకి) చేరారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆధ్వర్యంలో పార్టీలో చేరగా.. ఆయనకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు, అమలు కానీ హామీలతో ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారని, పక్క పార్టీల వారిని పార్టీలో చేర్చుకుంటు పైశాచిక ఆనందం పొందుతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. నిఖార్సయిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు పార్టీ ని వదిలి వెళ్లరని, బీఆర్ఎస్ పార్టీ సముద్రంలాంటిదన్నారు. ప్రతి ఒక్కరు బీఆర్ ఎస్ పార్టీ పటిష్టతకు సైనికుడిగా పనిచేయాలని, బీఆర్ ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడలని గాంధీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు సైనికుడిగా పనిచేయాలని, బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని పేర్కొన్నారు.