కాసాని జ్ఞానేశ్వర్ నీ భారీ మెజారిటీతో గెలిపించండి

  •  ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ 

నమస్తే శేరిలింగంపల్లి: చేవెళ్ల గడ్డపై మూడోసారి బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని గంగారాం విలేజ్ , పలు కాలనీలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం చేపట్టారు.

పార్టీ కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ ఓటు అభ్యర్తిస్తున్న ఎమ్మెల్యే గాంధీ, నాయకులు, కార్యకర్తలు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని, కాసానిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయలేదని ప్రజలకు వివరిస్తూ, మోసం చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని, ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటూ, కాపాడుకుంటూ వచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు.

ఓటర్లకు అభివాదం చేస్తూ…

బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిత్యావసర సరుకులు, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల బతుకులపై గుది బండగా మారిందని, మత రాజకీయాలు చేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పా ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here