అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే కాంగ్రెస్ ద్యేయం

  • ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించండి
  • ప్రజలను కోరిన చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ ప్రేమ నగర్, మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ బస్తీలో కార్నర్ మీటింగ్ సభ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్, ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్ హాజరై మాట్లాడారు. మే 13న ప్రతిఒక్కరు తమ బాధ్యతగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు.

ఆదిత్య నగర్ బస్తీలో కార్నర్ మీటింగ్ సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, పక్కన జేరిపాటి జైపాల్, జగదీశ్వర్ గౌడ్

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధిలో భాగమవ్వడానికి, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల ప్రాంతపు సమస్యల పై పూర్తి అవగాహనా ఉన్న వ్యక్తిగా, వాటికి పరిష్కారం చూపగలిగే తమ నాయకుడిగా మీకు తోడుగా ఉంటానని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మద్దతు పలకాలని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి పిలుపునిచ్చారు.

పాల్గొన్న ప్రజలు , పార్టీ నాయకులు, కార్యకర్తలు

చేవెళ్ల పార్లమెంట్ లో నెలకొన్న ఎన్నో సమస్యలకు తనదైన రీతిలో పరిష్కారం చూపించిన నాయకుడు రంజిత్ అన్న అని, చేవెళ్ల పరిధిలోని నియోజవర్గాల నాయకులకు, ప్రజలకు ప్రతి నిమిషం అందుబాటులో ఉంటూ గడిచిన 5 సంవత్సరాలలో ఎన్నో సమస్యలను పార్లమెంట్ లో లేవనెత్తి వాటికీ పరిష్కారం చూపెట్టడంలో రంజిత్ రెడ్డి సఫలీకృతమయ్యారని, మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు, మైనారిటీ సోదరులు, మహిళా సోదరీమణులు,యువ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, సేవాదళ్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here