తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

  • ఆవిష్కరించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • రెండో విడుత గొర్రెల పంపిణీ చేపట్టాలంటూ తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం అధ్యక్షులు కొమ్ము అశోక్ యాదవ్, గౌరవ సలహాదారు భేరి రామచందర్ యాదవ్ విన్నపం

నమస్తే శేరిలింగంపల్లి : రాష్ట్ర సచివాలయంలో లో రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, రాష్ట్ర ముఖ్య సలహాదారి బేరి రామచందర్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో పూల బొకేతో ఘనంగా సన్మానించారు.

రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, రాష్ట్ర ముఖ్య సలహాదారి బేరి రామచందర్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ లు

ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర నూతన సంవత్సర క్యాలెండర్ ను మంత్రి ఉత్తంకుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సహకార సంఘ సొసైటీల ద్వారా రెండో విడత నగదు త్వరగా బదిలీ చేయాలని వినతి పత్రం ఇస్తూ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి గొర్రె కాపరుల ఆవేదని అర్థం చేసుకొని స్పందించి గొర్రెలు కాపరులకు ఎన్ సిడిసి నాబార్డ్స్ లోన్స్ కేంద్ర ప్రభుత్వం సహకారంతో గొర్రెల కాపరులకు సబ్సిడీతో నగదు బదిలీ చేసి తగినన్యాయం చేయాలని కోరుకుంటు తెలంగాణ రాష్ట్ర జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంకి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.

మంత్రి కి బొకే అందిస్తూ…

మంత్రి సానుకూలంగా స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి డిడి లు కట్టిన ప్రతి గొర్రె కాపరులకు తగిన న్యాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చెగొండ రాజన్న యాదవ్, నల్గొండ జిల్లా అధ్యక్షులు రామాంజి యాదవ్, వనపర్తి జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిగుర్ల శ్రీనివాస్ యాదవ్, జన్నారం మండల అధ్యక్షుడు గట్టు మహేష్ యాదవ్, మందమర్రి మండల నాయకులు సంధని వేణి మల్లేష్ యాదవ్, సతీష్ యాదవ్, పరశురామ్ యాదవ్, పవన్ యాదవ్, రాజకుమార్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మధుకర్ యాదవ్, తిరుపతి యాదవ్, అంజి యాదవ్, ఓదన్న యాదవ్, ఉమేష్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here