అన్ని హంగులు, వసతుల కలబోత శ్రీకృష్ణ యాదవ సంఘం భవనం : పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

  • రూ. 5 కోట్లతో నిర్మాణం
  • పూర్తి కావస్తున్న పనులు
  • భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి
రంగారెడ్డి జిల్లా కోకాపేట్ లో నిర్మిస్తున్న శ్రీకృష్ణ యాదవ సంఘం భవన నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని సన్మానిస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి జిల్లా కోకాపేట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ కృష్ణ యాదవ సంఘం భవనం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్మాణ పనులను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బిల్డింగ్ కాంట్రాక్టర్, ఉన్నత అధికారులతో కలిసి యాదవ్ సంగం బిల్డింగ్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. నాణ్యతతో బిల్డింగ్ నిర్మించాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు యాదవులకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు, చైర్మన్ పదవులు కూడా ఇచ్చారని చెప్పారు. అంతేకాక యాదవ విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా కృషి చేస్తున్నదని తెలిపారు. ఇందుకోసం కోకాపేట్ లో అతి ఖరీదైన స్థలాన్ని యాదవులకు కేటాయించి, ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరలో అన్ని వసతులతో కూడుకున్న రూ. 5 కోట్లతో శ్రీకృష్ణ యాదవ సంఘం భవనాన్ని నిర్మిస్తున్నదని స్పష్టం చేశారు.

రంగారెడ్డి జిల్లా కోకాపేట్ లో నిర్మిస్తున్న శ్రీకృష్ణ యాదవ సంఘం భవనం

ఎంపీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ అతి త్వరలో భవన నిర్మాణం పూర్తీ అవుతుందని, పెద్ద ఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమం చేపడతామని తెలిపారు. రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం ఎమ్మెల్సీ మాట్లాడుతూ గొల్ల కురుమల అభివృద్ధి కోసం ఎంతో కృషిచేసి మన భావితరాల కోసం ఈ భవనం నిర్మిస్తున్నట్లు చెప్పారు. శ్రీకృష్ణ యాదవ్ సంఘం భవనం చైర్మన్ చింతల రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్యే నోముల భరత్ యాదవ్, బోయిన్ పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, సినీ నిర్మాత చిన్న శ్రీశైలం యాదవ్, వి. నవీన్ యాదవ్, నార్సింగ్ వైస్ చైర్మన్ జి. వెంకటేష్ యాదవ్, మాజీ సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆర్ . లక్ష్మణ్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర గొర్రెలు పెంపకం దారుల సొసైటీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల యాదవ్ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు పెద్ద ఎత్తున పాల్గొనగా వారందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక యాదవ సంఘం హెడ్ క్వార్టర్ భవనం నిర్మించుకుని, అక్కడ యాదవుల అభివృద్ధి, ఐక్యతకోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో పెరుగు ఐలేష్ యాదవ్, శ్రీహరి యాదవ్, అందెల కుమార్ యాదవ్, మసీద్ బండ కొండాపూర్ మారబోయిన రవి యాదవ్, శ్రీశైలం యాదవ్, తుమ్మటి మల్లేష్ యాదవ్, బండ్లగూడ జాగిర్ ప్రవీణ్ యాదవ్, సంఘం సభ్యులు కోకాపేట్ మల్లన్న యాదవ్ సంఘం సభ్యులు ,అంజయ్య నగర్ సిద్దిక్ నగర్ శ్రీ మల్లన్న స్వామి యాదవ సంఘం అధ్యక్షులు అప్పల వినోద్ కుమార్ యాదవ్, డి. శాంతయ్య యాదవ్, ఎస్. మహేశ్వర్ యాదవ్ ట్రెజరర్ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు చందు యాదవ్, యాదవ సంఘం సభ్యులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here