నమస్తే శేరిలింగంపల్లి: భగత్ సింగ్ ఆశయ సాధన కోసం యువత పాటుపడాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు పిలుపునిచ్చారు. ఆదివారం శేరిలింగంపల్లి యువజన సమాఖ్య మండల కమిటీ సమావేశం రక్తం నాగేష్ గౌడ్ భవనంలో జెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొని పర్వతాలు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాలు రాలేదని, చెడు వ్యసనాలకు బానిసలు అవుతూ చెడిపోతున్నారని తెలిపారు.
యువత చెడిపోకుండా దేశం కోసం మంచి మార్గంలో వెళ్లాలని దానికి ఏఐవైఎఫ్ సంఘం మంచి సంఘమని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఏ ఐ వై ఎఫ్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ పేరుతో రంగారెడ్డి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత క్రీడారంగంపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి టి. రామకృష్ణ మాట్లాడారు. మంచి ఆశయ సాధనతో యువత భవిష్యత్తు ఉండాలని అప్పుడే యువత బాగుపడుతుందని రామకృష్ణ అన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కిషోర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకటస్వామికే చందు యాదవులు సమావేశంలో మాట్లాడారు. అనంతరం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ప్రెసిడెంట్ సహారా కృష్ణ, వైస్ ప్రెసిడెంట్. తలారి జ్ఞానేశ్వరి, ప్రధాన కార్యదర్శి జెట్టి శ్రీనివాస్, పానుగంటి పర్వతాలును ప్రకటించారు.