వేడుకగా శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ దేవాలయం వార్షికోత్సవ మహోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి : శ్రీసాయి రామ్ కాలనీ లోని శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ దేవాలయం (నవమ) 9వ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా జరిగింది. దేవాలయంలో ఉదయం శ్రీ గణపతి హోమం, శ్రీ గణపతి పూజ , శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి , అన్నసమారాధన నిర్వహించడం జరిగింది.

శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గాంధీ

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, బీజేపి జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి , భారాస హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, దేవాలయ కమిటీ అధ్యక్షులు బోయిని శంకర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కైతాపురం పాపయ్య, కోశాధికారి కైతాపురం జితేందర్ , బీజేపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేష్ యాదవ్, బీజేపి జిల్లా అధికార ప్రతినిధి మారం వెంకట్, బీజేపి హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, బీజేపి మియాపూర్ డివిజన్ అధ్యక్షులు మాణిక్ రావు, బీజేపి జిల్లా మజ్దూర్ మోర్చా అధ్యక్షులు ఆళ్ల వరప్రసాద్, బీజేపి జిల్లా గీతా సెల్ కన్వీనర్ రవి గౌడ్, బీజేపి నాయకులు నవీన్, కమిటీ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here