నమస్తే శేరిలింగంపల్లి : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ జయ దుర్గ మైసమ్మ తల్లి నూతన కమిటీ సభ్యులుగా నియమితులైన వారికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ నియామక పత్రాలు అందించారు.
కూన సత్యం గౌడ్ (చైర్మన్), గుంజరి సత్యనారాయణ ముదిరాజ్, ఎం.కృష్ణా రెడ్డి, కె.గోపాల కృష్ణ, మాలెంపాటి సురేష్, ఎన్.శ్రీనివాస రెడ్డి, సదా మహేష్, జి.లహరి, బొడ్డ వెంకట మహాలక్ష్మి నూతన కమిటీ సభ్యులుగా నియమితులైన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కావూరి ప్రసాద్, కొడాలి రవి, రాజీ రెడ్డి, వెంకటేష్, దగ్గిపాటి, వాసు, రామకోటేశ్వర రావు, శ్రీనివాస్ రావు, రాజేందర్ ప్రసాద్, వెంకట్ రావు, కొఠారి వెంకట్, ఎస్.వి రావు పాల్గొన్నారు.