మిడ్ లాండింగ్ లిఫ్ట్ పెడితే ఎన్ఓసి కష్టం

  • ఎస్విఎం గ్రాండ్ లో నేరేడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్యసమావేశం
  • ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడిన జిహెచ్ఎంసి అధికారులు సిపి మల్లిఖార్జున్ రావు, ఏసీపీ సురేందర్ రెడ్డి, ఏసీపీ గణపతి, ఏసీపీ సంపత్
సమావేశంలో మాట్లాడుతున్న జిహెచ్ఎంసి అధికారి సిపి మల్లిఖార్జున్ రావు, పాల్గొన్న ఏసీపీ సురేందర్ రెడ్డి, ఏసీపీ గణపతి, ఏసీపీ సంపత్

నమస్తే శేరిలింగంపల్లి: నేరేడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మియాపూర్ లోని హోటల్ ఎస్విఎం గ్రాండ్ లో సర్వసభ్యసమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిహెచ్ఎంసి అధికారులు సిపి మల్లిఖార్జున్ రావు, ఏసీపీ సురేందర్ రెడ్డి, ఏసీపీ గణపతి, ఏసీపీ సంపత్ హాజరయ్యారు. ఈ సందర్బంగా సిటీ ప్లానర్ మల్లిఖార్జున్ రావు మాట్లాడుతూ కంపౌండింగ్ ఫీజు టీడీఆర్ పూర్తిగా అర్హుడని, అలాగే రెండువేల చదరపు గజాల పైన ఉన్న వాటికీ మాత్రమే టీడీఆర్ మీద రెండు ఫ్లోర్స్ అనుమతి ఇస్తున్నారని, రెండువేల చదరపు గజాల కంటే తక్కువ ఉన్న వాటికీ ఒక్క ఫ్లోర్ కి మాత్రమే టీడీఆర్ మీద అనుమతి అని, అపార్టుమెంట్స్ కు ఆరు సంవత్సరాల అనుమతి వరకు ఇవ్వడం జరుగుతుందని, అలాగే ఇండిపెండెంట్ ఇళ్లకు మూడేండ్లు ఇస్తున్నట్లు తెలిపారు. మిడ్ లాండింగ్ లిఫ్ట్ ఎవరిని పెట్టవద్దని, అలా పెడితే ఎన్ఓసి అనుమతి ఇవ్వడం కష్టం అవుతుందని చెప్పారు. రెసిడెన్షియల్ అనుమతి తీసుకొని కమర్షియల్ కట్టినట్లయితే దానికి ఎన్ఓసి ఇవ్వలేమని అన్నారు. కమర్షియల్ కి కమర్షియల్ గానే అనుమతి తీసుకుంటే బాగుంటుందన్నారు. ఏసిపి సంపత్ మాట్లాడుతూ పార్కింగ్ లేకుండా ఇండిపెండెంట్ ఇళ్ళు కడుతున్నారని, ఫలితంగా వాహనాలన్నీ రోడ్లపై పెట్టడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ప్రతీ ఒక్కరు ఇండిపెండెంట్ ఇళ్ల వాళ్లు స్టిల్ట్ పార్కింగ్ తీసుకొని మిగతా పై ఫ్లోర్లు మాత్రం అనుమతి తీసుకొని కట్టుకుంటే బాగుంటుందని సూచించారు. ఏసీపీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ అనుమతులు దరఖాస్తు చేసిన వెంటనే టిఎస్ బిపాస్ లు ఇవ్వటం జరుగుతుందని, అనుమతుల్లో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు. టీడీఆర్ కంపౌండింగ్ ఫీజుకు చాలామంది కంప్యూటరైజేషన్ కాలేదన్నారని, అదికూడా వారం రోజుల్లో పూర్తవుతుందన్నారు. ఏసీపీ గణపతి మాట్లాడుతూ రోడ్ వైడింగ్ విషయంలో టీడిఆర్ ఇవ్వటం జరుగుతుందని, అలాంటి చోట బిల్డర్స్ ఎవరైనా ఉన్నా, తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వెంటనే ఇస్తే టీడిఆర్ ఇవ్వటంతో పాటు వారి సైట్ల విలువ కూడా పెరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో కార్ పార్కింగ్ లేకపోతే కార్ రిజిస్ట్రేషన్ కూడా కాదని చెప్పారు. కాబట్టి అందరూ కూడా కార్ పార్కింగ్ ఉండేటట్లు భవనాలు నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ప్రేమ కుమార్, చైర్మన్ చెన్నా రెడ్డి, ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్, సలహాదారు నర్రా నాగేశ్వర రావు, ట్రెజరర్ సుభాష్ బాబు, ఉపాధ్యక్షులు కోటేశ్వర రావు, లక్ష్మీ నారాయణ, మన్నే రవి, కార్యనిర్వాహక కార్యదర్శులు నరసింహ రెడ్డి, రామ్ కుమార్, ధీరాజ్ కుమార్, జాయింట్ సెక్రటరీలు లక్ష్మీపతి రాజు, రాజేంద్ర ప్రసాద్, బసంత్ కుల్దీప్, బి వి. సుబ్బా రెడ్డి పెద్దఎత్తున బిల్డర్స్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here