- డా.శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలలో భాగంగా మొక్కలు నాటి, చెరువులను సందర్శించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అసెంబ్లీ ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : ఏక్ _ పేడ్ __మా కే _నామ్_ కార్యక్రమంలో భాగంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అసెంబ్లీ ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్ శంషుగూడ ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటి, ఎల్లమ్మ చెరువును సందర్శించారు. ఆల్విన్ కాలనీ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు, డా.శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలలో భాగంగా ఏక్ పేడ్ మా కే నామ్ పేరుతో శంశిగూడ ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటడం, క్లీన్ ఇండియా, హెల్త్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఎల్లమ్మ చెరువును సందర్శించించినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా కాలనీల వాసులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చుట్టుపక్కల కాలనీల డ్రైనేజీ చెరువులో కలవడం వల్ల విపరీతమైన దుర్గంధపు వాసన, చెరువు శుభ్రం చేయకపోవడం వల్ల గుర్రపు డెక్క చేరి సాయంత్రం దోమల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ఆగిపోయిన పైప్ లైన్ పనులు పూర్తి చేయాలని, మహంకాళినగర్ లో కాలనీ రోడ్డుకు నిధులు మంజూరైన ఇంతవరకు పూర్తి చేయలేదని రవికుమార్ యాదవ్ కు తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడడానికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, వీలైనంత త్వరలో సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్రావు, రామరాజు, మణి భూషణ్, నరేందర్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, నర్సింగ్ యాదవ్, నరసింహ చారి, స్రవంతి, అరుణ్ కుమార్, కేశవులు, నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి రఘు, గోపాల్ రావు, బాలు యాదవ్, సాయి, నరేష్, సురేష్, సుధాకర్, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాసులు, చాంద్, రాజు, నరసింహ పాల్గొన్నారు.