నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ చార్జిగా కట్ట వెంకటేష్ గౌడ్ ని నియమిస్తూ టిఎస్ టిడిపి అధ్యక్షుడు కాసని జ్ఞానేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కట్ట వెంకటేష్ గౌడ్ కు నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకం ఉంచి శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ చార్జిగా తనను నియమించడం పట్ల టిఎస్ టిడిపి అధ్యక్షుడు కాసని జ్ఞానేశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన శాయశక్తులా పాటు పడుతానని చెప్పారు.