నిధులు మంజూరైన పనులు సున్నా

  • అభివృద్ధికి నోచుకోని పాపిరెడ్డి నగర్ థీమ్ పార్క్
  • బస్తీబాటలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: కూకట్ పల్లి డివిజన్ లోని పాపిరెడ్డినగర్ లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, కో- కన్వీనర్ మణి భూషణ్, డివిజన్ ఇంచార్జ్ నరేందర్ రెడ్డి బస్తీబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ పాపిరెడ్డి నగర్, చుట్టుపక్కల ఉన్న కాలనీవాసుల సౌలభ్యం కోసం దాదాపు రెండేండ్ల కిందట 1 కోటి 90 లక్షల రూపాయలతో నిధులు మంజూరైనా .. పనులు నత్తనడకగా సాగుతున్నాయన్నారు. పార్క్ లోపల వాకింగ్ ట్రాక్ లేదని, పిల్లలు, వృద్దులు కాలక్షేపం చేయడానికి మౌలిక వసతులు కల్పించకుండా పార్కు మొత్తం గదులు నిర్మించడం మంచి పద్ధతి కాదన్నారు. పార్కును అభివృద్ధి చేసే ఉద్దేశమే ఉంటే ప్రజలకు తెలిసేలా చెప్పి చేయాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం హరితహారం కింద నిధులు మంజూరు చేయగా.. వాటిని సక్రమంగా సద్వినియోగపరచుకోక పోగా మొక్కలన్నీ ఎండకు ఎండిపోయాయన్నారు. ముఖ్యంగా ట్రాన్స్ ఫార్మర్లలో తరచూ పెద్ద పెద్ద మంటలు, శబ్దాలు వస్తున్నట్లు కాలనీవాసులు తెలిపారని చెప్పారు. వెంటనే ట్రాన్స్కో ఏ ఈతో ఫోన్లో మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, నర్సింగ్ రావు, శ్రీహరి, అంజిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బాలు యాదవ్, శ్రీకాంత్, సాయి, రాజు , శ్రీలత పాల్గొన్నారు.

పాపిరెడ్డినగర్ లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్తీబాటలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, కో- కన్వీనర్ మణి భూషణ్, డివిజన్ ఇంచార్జ్ నరేందర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here