షబె బరాత్‌ ఏర్పాట్ల పరిశీలన

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లోని ముస్లిం శ్మశాన వాటిక లో షబె బరాత్‌ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ షబె బరాత్‌ సందర్భంగా అన్ని ఏర్పాట్లను చేయాలని , అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఆదిత్య నగర్ లోని ముస్లిం శ్మశాన వాటిక లో షబె బరాత్‌ ఏర్పాట్లనువ్ పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

షబె బరాత్‌కి అనేక పేర్లున్నాయని, లైలతుల్‌ బరఅతున్‌ అంటే నరకం నుంచి విముక్తి పొందే రేయి, లైలతుల్‌ ముబారక అంటే శుభాల రేయి, లైలతుస్సక్‌ అంటే దస్తా వేజుల రేయి.. అనగా ఒక సంవత్సర కాలంలో ప్రతి మనిషికి సంబంధించిన అనేక విషయాలు స్పష్టంగా లిఖించబడ తాయని పేర్కొన్నారు. కాని ఈ రేయి షబె బరాత్‌ అనే పేరుతో ప్రసిద్ధిగాంచిందని, ఇది అరబీ, ఫార్సీ భాషా పదాల సంగ్రహం అని తెలిపారు. షబ్‌ అంటే ఫార్సీ భాషలో రాత్రి అని, బరాత్‌ అంటే అరబీలో విముక్తి పొందటం, మోక్షం పొందటం అని అర్థాలు వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాశినాథ్ యాదవ్, బాబు మియా, ఖాసీం, రహీం, లియకాత్, సలీమ్, కాజా,సోహెల్, మునఫ్ సాజిద్,అమీర్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here