నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ లోని ఆదిత్య నగర్, సుభాష్ చంద్ర బోస్ నగర్ లలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎం .ఎల్ .ఏ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ పాదయాత్రలో పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణలోని పరిస్థితుల పైన పూర్తి అవగాహన ఉందని, దానికి అనుగుణంగానే 6 గ్యారంటీలతో మానిఫెస్టో రూపొందించారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుందని.. అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి ఓటు వేయాల్సిందిగా అభ్యర్ధించారు.