నమస్తే శేరిలింగంపల్లి: శ్రీ సత్య సాయి బాబా ట్రస్ట్, రాజు శెట్టి కురుమ సహకారంతో పాపిరెడ్డి కాలనీ వాంబె బస్తితో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో దాదాపు 250 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.

సీజనల్ వ్యాధులు పెరిగిపోతున్న వేళా అనేక రోగాలకు, జ్వరాలకు గురై హాస్పిటల్ ఛార్జీలు కట్టలేని స్థితిలో ఉన్న సమయంలో శిబిరం నిర్వహించడం పట్ల బస్తి వాసులు హర్షం వ్యక్తం చేశారు. పేద వారికి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవ చేసే భాగ్యం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నానని బీజేపీ శేరిలింగంపల్లి 106 డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టి కురుమ అన్నారు.
