రేషన్ డీలర్స్ సమస్యలు పరిష్కరించాలి

నమస్తే శే రిలింగంపల్లి: రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న రేషన్ డీలర్స్ రిలే నిరాహార దీక్షలలో భాగంగా చందానగర్ జిహెచ్ఎంసి కార్యాలయం, అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు శేర్లింగంపల్లి టిడిపి తరఫున సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కట్ట వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ రేషన్ షాప్స్ నడిపిస్తున్న వారికి క్వింటాల్కు 70 రూపాయల చొప్పున ఇవ్వటం వల్ల వారికి నెలసరి ఆదాయము పదివేల రూపాయల కంటే ఎక్కువ రావాడం లేదని, రేషన్ షాప్ మైంటైన్ చేయాలంటేనే దాదాపుగా 20000 రూపాయల ఖర్చు అవుతుందని, రాష్ట్ర రేషన్ షాపుల గురించి ఎన్నిసార్లు సంబంధిత మంత్రికి వినతి పత్రాలు ఇచ్చిన సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు.

రిలే నిరాహార దీక్షలో..

సమ్మె విరమించకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని మంత్రి చెప్పటం దుర్మార్గమైన చర్యగా ఖండిస్తున్నామని తెలిపారు. వారికి నెలకు 40 వేల రూపాయలు ఇచ్చి రేషన్ డీలర్లు అందరినీ ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 17200 రేషన్ షాప్ కుటుంబాలను ఆదుకొని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున మాదాపూర్ డివిజన్ కోఆర్డినేటర్ ఆరేపల్లి సాంబ శివ గౌడ్, కొండాపూర్ డివిజన్ కోఆర్డినేటర్ సిరాజుద్దీన్, కిరణ్, కిషోర్ యాదవ్, రాజశేఖర్, శేర్లింగంపల్లి నియోజకవర్గం రేషన్ షాప్ డీలర్ల అధ్యక్షులు యాద గౌడ్, మల్లికార్జున్ యాదవ్, సంజీవరెడ్డి, గోపాల్ గౌడ్, కిషోర్ కుమార్, ప్రవీణ్ డీలర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరాహార దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.

దీక్ష విరమణ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here