శేరిలింగంపల్లి, మార్చి 10 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ లోక కల్యాణం కోసం నిర్వహించిన అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి ఉత్సవాలు ఎంతో దోహదపడతాయని, భక్తి భావం సమాజంలో ఐక్యతను పెంచుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.






