శేరిలింగంపల్లి, మార్చి 10 (నమస్తే శేరిలింగంపల్లి): సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి బిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే నిమ్నవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించారని, వారి హక్కుల కోసం పోరాడిన మహానీయురాలని అన్నారు. తన భర్త జ్యోతిబాఫూలేకు తోడుగా ఎన్నో ఉద్యమాల్లో ఆమె పాల్గొన్నారని, మహిళా విద్యకు పెద్ద పీట వేస్తూ స్త్రీలు చదువుకునేందుకు ఆమె ఎన్నో పాఠశాలలను ప్రారంభించారని తెలిపారు.






