శేరిలింగంపల్లి, మార్చి 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంటలో ఉన్న న్యూ నేషనల్ హైస్కూల్, ప్రభుత్వ పాఠశాల, చందానగర్ లోని సరస్వతి విద్యా మందిర్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, సామాజిక కార్యకర్త కట్ల చంద్రశేఖర్ రెడ్డి పరీక్షా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కట్ల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ముందుకు సాగాలంటే విద్య ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యతోనే మంచి భవిష్యత్తు నిర్మించుకోవచ్చని, ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, స్థానికులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.






