శేరిలింగంపల్లి, మార్చి 10 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కాలనీలో మహిళా భవనం నిర్మాణం కోసం రూ.20 లక్షల అంచనా వ్యయంతో ( SDF FUNDS నిధులతో ) నిర్మించడానికి గాను నిధుల మంజూరు కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి పంపిన మంజూరు పత్రాలను కాలనీ వాసులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రేమ్ నగర్ కాలనీ లో మహిళల విజ్ఞప్తి మేరకు మహిళా భవనం నిర్మాణం కోసం SDF ఫండ్స్ ద్వారా రూ.20 లక్షలను మంజూరు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరు కాగానే మహిళా భవనాన్ని త్వరితగతిన నిర్మిస్తామని, నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు తిరుపతి, వాసల వెంకటేశ్వర రావు, గాజుల మహేందర్, కొనవేని రమేష్, వాసల శ్రీనివాస్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






