శేరిలింగంపల్లి, మార్చి 11 (నమస్తే శేరిలింగంపల్లి): పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలు రాసి తల్లిదండ్రులకు, ఊరికి మంచి పేరు తేవాలని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ వేముకుంట ఉర్దూ మీడియం స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి పరీక్ష రాసేందుకు ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు, స్కేళ్లు తదితర వస్తువులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని, శేరిలింగంపల్లి మండల పరిధిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిస్తే బహుమతులను అందజేస్తానని తెలిపారు. విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఎం.డి గౌస్, ప్రకాష్, చందర్రావు, అనంతరెడ్డి, షబానా, బాబా, స్కూలు ప్రధాన ఉపాధ్యాయురాలు, స్కూల్ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.






