శేరిలింగంపల్లి, మార్చి 11 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ మాసం పురస్కరించుకొని ఉమ్మడి మియాపూర్ డివిజన్ లోని BRS నాయకులు BSN కిరణ్ యాదవ్, జహంగీర్, శివరాజ్ కలసి మక్తా మహబూబ్‌పేట్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శేలింగంపల్లి బిఆర్ఎస్ ఇంచార్జ్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం యాదవ్, బొబ్బ నవతారెడ్డి, కలిదిండి రోజా, గోపరాజు శ్రీనివాసరావు, సుబ్బరాజు, శ్రీకాంత్, రాయల్ కార్తిక్, శ్రీధర్, అల్లాద్దీన్ పటేల్, సద్దాం, జనార్థన్ గౌడ్, సంగారెడ్డి, రవీంద్ర యాదవ్, గణేశ్ రెడ్డి, సంతోష్, సుధాకర్, చిన్న నర్సింగ్, సురేష్ గౌడ్, సంజీవరెడ్డి, చందు వర్మ, చంద్ర, రాము, గౌస్, వడ్డెరాజు, ఎల్లేష్ పాల్గొన్నారు.






