- గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్ర లో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
నమస్తే శే రిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ లో హెచ్ఎంటి హిల్స్, తులసి నగర్ లో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ సారధ్యంలో గడపగడపకు బిజెపి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రగతి నగర్ నుండి హెచ్ఎంటి హిల్స్ రోడ్డు ట్రాఫిక్ సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారని, స్థానికుల కోరిక మేరకు ట్రాఫిక్ సమస్యను తీర్చేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారి పక్షాన బిజెపి ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
అంతేకాకుండా హెచ్ఎంటీ హిల్స్ రిటైర్ ఉద్యోగులకు పెన్షన్స్ విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్లి వారిని కూడా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నవీన్ గౌడ్, అరుణ్ కుమార్, వేణుగోపాల్ యాదవ్, చంద్రమౌళి, ఎంకే దేవ్, నాగిరెడ్డి, సీతారామరాజు, కృష్ణంరాజు, సునీల్ రెడ్డి, రాజారెడ్డి, శ్రీనివాస్, చంద్రశేఖర్, ప్రసాద్, రామయ్య, కృష్ణ, శ్రీదేవి, సైదమ్మ పాల్గొన్నారు.