- క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్
నమస్తే శే రిలింగంపల్లి: క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని, క్రమశిక్షణ పెరుగుతుందని మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని లీగల క్రికెట్ గ్రౌండ్స్ లో పురం విశ్వకాంత్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు.
ఈ టోర్నమెంట్ ను పురం విశ్వకాంత్ రెడ్డి మెమోరియల్ లో భాగంగా నిర్వహించిన విజేయందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లను అభినందించారు. కార్యక్రమంలో రాగం అభిషేక్ యాదవ్, ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆదిత్య శంకర్, సాయి కుమార్, సందీప్ కుమార్, అనీష్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, గోపాల్ యాదవ్, రాజు, క్రీడాకారులు పాల్గొన్నారు.