- సహాయక చర్యలను పరిశీలించిన ప్రభుత్వ విప్ గాంధీ
- ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశం
నమస్తే శేరిలింగంపల్లి : నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు మియాపూర్ డివిజన్ పరిధిలోని దోవ కాలనీ, కేంద్రీయ విహార్, బస్ బాడీ వద్ద లోతట్టు ప్రాంతంలో కాలనీలు జలమయమయ్యాయి. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆయా ప్రాంతాలను సందర్శించి క్షేత్ర స్థాయిలో సహాయక చర్యలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని GHMC, జలమండలి అధికారులు, మాన్ సున్ ఎమర్జెన్సీ టీమ్స్ , డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాలని, లోతట్టు కాలనీలు, ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ముంపుకు గురైన కాలనీ లలో మోటర్ల ద్వారా నీటి తొలగించి యాదస్థితికి తీసుకురావాలని, రోడ్లను పునరుద్ధరించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. ప్రజలు అభద్రత కు లోను కాకుండా ధైర్యంగా ఉండాలని, వర్షాలు పడుతున్న సమయంలో ఇంటి నుండి బయటకి రాకూడదని , తప్పని పరిస్థితుల్లో బయటకి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. అధికారులు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాలు , నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి సమస్యను పరిష్కరించాలని, ప్రజలకు నిత్యం ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు గంగాధర్ రావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, చంద్రిక ప్రసాద్ గౌడ్, మురళి, కోటయ్య, సురేష్ కాలనీ వాసులు పాల్గొన్నారు.