సిఆర్పిఎఫ్ క్యాంపు ఎదుట తండావాసుల నిరసన

  • రాత్రి కురిసిన వర్షాలకు జలమయమైన నడిగడ్డ తండా
  • వర్షాలకు కూలిన ఇండ్లను పునర్నిర్మించుకోనివ్వటం లేదంటూ ఆవేదన.. నిరసన

నమస్తే శేరిలింగంపల్లి : నిన్న రాత్రి కురిసిన వర్షానికి నడిగడ్డ తండా జలమయమైంది. ఇండ్లు కూలిపోవటంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. తమ ఇండ్లను పునర్నిర్మాణం చేసుకునేందుకు ముడి సామాగ్రిని తండా లోపలికి అనుమతించాలని తండావాసులు అందరూ కలసి సిఆర్పిఎఫ్ క్యాంపు ఎదుట నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ (AIBSS ) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి దశరత్ నాయక్ మాట్లాడుతూ నడిగడ్డ తండాను సి ఆర్ పి ఫ్ పరిధి నుండి మినహాయించి, ఇండ్లు కట్టుకునే విధంగా అనుమతించాలని, చాలాసార్లు ప్రజాప్రతినిధుల, ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్పిఎఫ్ నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలో నడిగడ్డ తండాలో 40 ఏండ్ల నుండి దాదాపు 800 కుటుంబాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వెనుకబడిన వర్గాల పేద ప్రజలు స్థిర నివాసాలు ఉన్నాయని, 2016 సంవత్సరం నుంచి సీఆర్పీఎఫ్ బెటాలియన్ నడిగడ్డ తండా ముందు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి పాత ఇండ్లను పునర్నిర్మించకుండా అడ్డుకుంటుండడంతో అవస్థలు పడుతున్నామని తండావాసులు వాపోయారు. సమాచారం అందుకున్న మియాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతి రావు , సబ్ ఇన్స్పెక్టర్ రవి కిరణ్ తాండకు వచ్చి సిఆర్పిఎఫ్ సిబ్బందితో కలిసి పర్యటించి వర్షాల కారణంతో కూలిపోయిన ఇండ్లను పునర్నిర్మానం చేయుటకు అనుమతించాలని, తండావాసుల తరపున విజ్ఞప్తి చేయడంతో సిఆర్పిఎఫ్ సిబ్బంది సానుకూలంగా స్పందించారు. ఇందుకు సహకరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, సబ్ ఇన్స్పెక్టర్ రవి కిరణ్ కి తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తండ గిరిజన సంక్షేమ సంఘం, కమిటీ ప్రధాన కార్యదర్శి, నాయిని రత్నకుమార్ , సీతారాం నాయక్, మద్దిలేటి ముదిరాజ్, మోహన్ నాయక్, కృష్ణా నాయక్, డి నర్సింహా, రమేష్ యాదవ్, చందు యాదవ్, Yఆంజనేయులు, తేజావత్ బాలు నాయక్, బి వెంకటేష్, రతన్ నాయక్, ఈశ్వర్, సురేష్ నాయక్, జై మధు నాయక్, రాందాస్, హరిలాల్ నాయక్, సంపత్ పాల్గొన్నారు.

నడిగడ్డ తండాలో వర్షపు నీటిని మోటార్ల సహాయంతో తోడుతున్న స్థానికులు

నడిగడ్డ తండాలో సిఆర్పిఎఫ్ క్యాంపు ఎదుట తండావాసులు నిరసన.
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here