శేరిలింగంపల్లి, మార్చి 2 (నమస్తే శేరిలింగంపల్లి): BRS పార్టీ శేరిలింగంపల్లి ఇంచార్జ్, కూకట్‌పల్లి MLA మాధవరం కృష్ణారావు సూచన మేరకు ఉమ్మడి మియాపూర్ డివిజన్ లో పార్టీ ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలపై పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు సుభాష్ చంద్రబోస్ నగర్ రోడ్ నంబర్ వన్ నుండి పాదయాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామన్నారు. శేరిలింగంపల్లి ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా బినామీలకు అండగా ఉంటున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయిస్తున్నారని, భూములను కబ్జా చేస్తూ బినామీలను కాపాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తారని ఓటు వేస్తే వారి సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి, BSN కిరణ్ యాదవ్, కలిదిండి రోజా, గోపరాజు శ్రీనివాసరావు, శివరాజ్ ముదిరాజ్, కాసాని శ్రీధర్, శ్రీనన్న, జహంగీర్, రవి, కృష్ణా నాయక్, తిరుపతి నాయక్, గోపాల్ నాయక్, నర్సింగ్, వంశీ, సుధాకర్, రాజు వడ్డేరాజ్ చిన్న, శ్రీశైలం, వరలక్ష్మి, రమేష్, హనుమంత్, శ్రీను, చందు వర్మ తదితరులు పాల్గొన్నారు.






