నమస్తే శేరిలింగంపల్లి: సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమని, బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు తమ అమ్యులమైన ఓటు వేసి గెలిపించాలని చందానగర్ డివిజన్ బిఆర్ఎస్పార్టీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్, చందానగర్, తారనగర్ కాలనీలలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అనుబంధ సంఘాలతో కలిసి చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రజలకు కాలనీవాసులకు బిఆర్ఎస్ పార్టీ మెనిఫెస్టో గురించి వివరిస్తూ ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేయడం జరిగిందన్నారు. పేద బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం దళిత బంధు పథకం, బిసి బంధు పథకం, ఆసరా పింఛన్లు, దివ్యాంగుల పింఛన్లు, కేసిఆర్ కిట్లు ఇలా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా నగరంలో కాలనీలలో పుర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు పార్కులు, సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి పనులకు నిధులు కేటాయించడ మైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘుపతి రెడ్డి, రవీందర్ రావు, లక్ష్మినారాయణ గౌడ్, జనార్ధన్ రెడ్డి, గురుచరణ్ దూబె, పులిపాటి నాగరాజు, ఓర్సు వెంకటేశ్వర్లు, పబ్బ మల్లేష్ , ప్రవీణ్, వెంకట్ రావు, అక్బర్ ఖాన్, యూసుఫ్, ఎల్లమయ్య, పారునంది శ్రీకాంత్, నరేందర్ భల్లా , అంజద్, రాజశేఖర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, రాహుల్, ఉదయ్, యశ్వంత్, వెంకటేశ్ పాల్గొన్నారు.