25 కోట్ల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : సిపిఐ డిమాండ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండల పరిధిలోని కొత్తగూడ రెవెన్యూ పరిధిలో 44 సర్వే నెంబర్లు 11 గుంటల భూమిని ఒక బడా కన్స్ట్రక్షన్ కంపెనీ యాజమాన్యం కబ్జాకు పాల్పడి ఆక్రమించిన స్థలం విలువ మార్కెట్ ధర ప్రకారం రూ. 25 కోట్లు ఉంటుందని, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి తహసిల్దార్ శ్రీనివాసులును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ భూములను, చెరువులను ఆక్రమించి దర్జాగా విల్లాలు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారని, వందల వేల కోట్లు సంపాదిస్తున్నారని, అలాంటి అక్రమార్కుల పైన చర్యలు తీసుకోవాలని సిపిఐ విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పటికే జయభేరి కన్స్ట్రక్షన్, వర్టెక్స్ కన్స్ట్రక్షన్, అపర్ణ కన్స్ట్రక్షన్, వాసవి కన్స్ట్రక్షన్, సుమధుర, ఎస్ ఎం ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అనేక ప్రభుత్వ భూములను ఆక్రమించి దర్జాగా అపార్ట్ మెంట్లు కడుతున్నారని, ఈ కన్స్ట్రక్షన్స్ కంపెనీల యాజమాన్యాల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని సిపిఐ రామకృష్ణ డిమాండ్ చేశారు.
వినతి పత్రం ఇచ్చిన వారిలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు కే చందు యాదవ్, కె వెంకటస్వామి, నియోజకవర్గ నాయకులు ఖాసిం, ఎస్, కొండలయ్య, జెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here