నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ లోని పలు పోలింగ్ కేంద్రాలను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం మందకొడిగా కొనసాగిందని, ఇప్పటికైనా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేసి పోలింగ్ శాతాన్ని పెంచాలని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిందని , ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.