నమస్తే శేరిలింగంపల్లి: అసెంబ్లీ ఎన్నికల అనంతరం.. స్వల్ప కాలంలోనే పార్లమెంట్ ఎన్నికల నగారా మోగింది..చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం గడచిన నెల రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత పాదయాత్రలు.. ఎన్నికల ప్రచారం..పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశాలతో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ హడావిడిగా గడిపారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇంట్లో తన మనువడు ఆర్య వీర్ తో ఆటలాడుతూ ఆటవిడుపును పొందారు. మనుమడుతో కలిసి టీవీలో కార్టూన్ వీడియోలను తిలకిస్తూ.. చిన్నారిని ఆటలాడిస్తూ సరదాగా గడిపారు.