- టౌన్ ప్లానింగ్ విభాగానికి ఆదేశించిన శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : రోడ్డు విస్తరణ కోసం బెటాలియన్ మెయిన్ గేట్ నుంచి తాహెర్‌విల్లే రోడ్డు వరకు శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేతకు అనుమతి ఇవ్వాలని పోలీస్ బెటాలియన్ కమాండెంట్‌కు లేఖ రాయాలని టౌన్ ప్లానింగ్ విభాగానికి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి ఆదేశించారు. జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ పనులు చేపట్టేందుకు భూసేకరణ కోసం సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని, ప్రభావిత ప్రాంతంలోని దుకాణం లేదా ఇంటి యజమానులను సంప్రదించాలని టౌన్ ప్లానింగ్ విభాగానికి సూచించారు.
శ్మశాన వాటికను సామాన్య ప్రజానీకం వినియోగించుకుంటున్నారా లేదా అనే అంశంపై 99-వెంగళ్రావునగర్ డివిజన్ కార్పొరేటర్‌తో చర్చించాలని ఇంజినీరింగ్ విభాగానికి సూచించారు. ఇదే విషయాన్ని ఇంజినీరింగ్ విభాగం కార్పొరేటర్‌తో చర్చించగా, శ్మశాన వాటికను సామాన్య ప్రజానీకం వినియోగించుకుంటున్నారని, పరిపాలన అనుమతి కోసం ప్రతిపాదనలు పంపవచ్చని ఆమె తెలిపారు. ఆయన వెంట యూసుఫ్ గూడ సర్కిల్ డీ సి సేవా ఇస్లావత్, ఈఈ రాజ్ కుమార్, ఏఎంహెచ్ఓ డా. కవిత, ఏసీపీ రాణి, రోడ్ వైడెనింగ్ డీసీపీ గణపతి ఉన్నారు.