- గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పోటీలు
- పోస్టర్, ట్రోఫీని ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్, మసీద్ బండ కార్యాలయంలో ఆగస్ట్ 11న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో డ్రాగన్ కుంగ్ ఫూ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఓపెన్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ షిప్ పోటీలకి సంబంధించిన పోస్టర్ ట్రోఫీని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసం కలుగుతుందన్నారు, సమాజంలో మారుతున్న పరిణామాల దృష్ట్యా తల్లిదండ్రులు ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని కోరారు. మార్షల్ ఆర్ట్స్ పోటీలు నిర్వహిస్తున్న డ్రాగన్ కుంగ్ఫ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి అభినందనలు తెలిపారు. ఆగస్ట్ 11న జరిగే ఈ పోటీలలో ప్రపంచ నలుమూలల నుండీ విచ్చేసి పోటీలలో పాల్గొని గెలుపొందాలని ఆకాంక్షించారు.